కూకట్పల్లి ఎల్లమ్మబండలో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై 40 ఏళ్ల కాంమాంధుడు అత్యాచారానికి యత్నించాడు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని దత్తాత్రేయ కాలనీలో మహిపాల్ రెడ్డి అనే వ్యక్తి తనసోదరుడి ఇంట్లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ రోజు ఉదయం స్థానికంగా ఉండే ఓ ఐదేళ్ల చిన్నారిని మహిపాల్ రెడ్డి చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి... తానూ నివాసం ఉండే భవనం మూడవ అంతస్తుపైకి తీసుకెళ్లాడు. చిన్నారిని పైకి తీసుకెళ్లడం గమనించిన స్థానికులు... పైకి వెళ్లి చూసే సరికి మహిపాల్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. స్థానికులను చూసిన నిందితుడు, అక్కడి నుండి పారిపోయాడు. అప్పటి నుంచి మహిపాల్ కోసం వెతుకుతున్న కాలనీ వాసులకు సాయంత్రం కనిపించగా వారు అతడిని పట్టుకుని చితకబాదారు. వారి నుండి తప్పించుకొని పారిపోతున్న సమయంలో మహిపాల్ కిందపడటం వల్ల తలకు తీవ్రగాయమయ్యింది. ఘటన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా గంట సమయం తర్వాత కూడా వారి నుంచి స్పందన లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడుతున్న వారిని ఉరితీయాలని స్థానికులు డిమాండ్ చేశారు.
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
రాష్ట్రంలో బాలికలపై అరాచక పర్వం కొనసాగుతోంది. తాజాగా ఈరోజు కూకట్పల్లి ఎల్లమ్మబండలో ఐదేళ్ల చిన్నారిపై నలభై ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాదారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు నిందితున్ని తీసుకెళ్లేది లేదని పోలీసులను అడ్డుకున్నారు.