తగ్గిన స్లాబులు
జీఎస్టీ మండలి తరచూ సమావేశమవుతూ అమలు తీరును సమీక్షించడంతో పాటు వివిధ వాణిజ్య వర్గాల నుంచి వస్తున్న వినతులను, ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటూ పన్నుల స్లాబులను తగ్గిస్తూ వస్తోంది. గత ఏడాది డిసెంబరు 22న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పుస్తకాలు, సినిమా టికెట్లతో పాటు పవర్ బ్యాంక్‌లు, డిజిటల్ కెమెరాలు, వీడియో కెమెరా రికార్డర్లు, 32 ఇంచుల వరకు టీవీలపై పన్ను స్లాబులు తగ్గించింది. ఇవీ ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చాయి.
థియేటర్లపై చర్యులు
వ్యాపార సంస్థలు పాత స్లాబులనే అమలు చేస్తూ వినియోగదారుల నుంచి వసూలు చేయడమే కాకుండా ప్రభుత్వానికి జమ చేయడంలేదు. గచ్చిబౌలి కొత్తగూడ కూడలి వద్ద ఉన్న ఏబీఎం, పీవీఆర్ సినిమా థియేటర్ యాజమాన్యం టికెట్లు పాత రేటుకే విక్రయించినట్లు కమిటీ గుర్తించింది. ప్రేక్షకుల నుంచి అదనంగా వసూలు చేసిన మొత్తాలను వడ్డీతో సహా చెల్లించాలని యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చింది. ఏబీఎం సంస్థ రూ. 36. 26 లక్షలు, పీవీఆర్ సినిమాస్ రూ. 17.93 లక్షలు చెల్లించాలని ఆదేశించినట్లు హైదరాబాద్ కేంద్ర జీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఏబీఎం వెంటనే ఆ మొత్తం చెల్లించింది.
ఫిర్యాదు చేయండిలా
జీఎస్టీపై ఎవరికైనా అనుమానాలు ఉంటే...సంబంధిత వ్యాపార, వాణిజ్య సంస్థలపై లక్డీకపూల్‌లోని తెలంగాణ రాష్ట్ర యాంటీ ఫ్రాఫిటీరింగ్ స్క్రీనింగ్ కమిటీకి ఫిర్యాదు చేయవచ్చని శ్రీనివాస్ తెలిపారు. e-mail: antiprofiteering.telangana@gmail.com (or) anti-profiteering@gov.inలకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన వివరించారు.
ఇవీ చూడండి:'మహా'లో మాజీ ప్రియుడు