ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా రెండూ కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ లాల్బజారులో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ''కొడంగల్‌లో చెల్లని నోటు లాల్బజారులో చెల్లుతుందా? కొడంగల్‌లో రాలిపోయిన పువ్వును మల్కాజిగిరిలోకి తెచ్చుకుని పూజించుకుంటామా?'' అని ప్రశ్నించారు. ఎన్నికలు పూర్తవగానే కంటోన్మెంట్ పరిధిలోని పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి:ఉద్యమ నాయకుడే... ఉత్తమ పాలకుడు: కేటీఆర్