ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం అనంతరం.. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. హైదరాబాద్ రాజ్ భవన్లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో సమావేశం అయ్యారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా రాజ్‌భవన్ వెళ్లారు. వైఎస్సార్ ఎల్పీ తీర్మాన ప్రతిని అందచేసిన జగన్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. జగన్ వెంట.. భార్య భారతి, ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ ఉన్నారు.
జగన్ విజ్ఞప్తిని పరిశీలించిన గవర్నర్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. ఈనెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ ముున్సిపల్ స్టేడియంలో మధ్యాహ్నం 12గంటల 23 నిమిషాలకు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇవీ చూడండి: కేసీఆర్‌తో జగన్ భేటీ.. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం