ETV Bharat / state

ఇఫ్తార్​ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

హైదరాబాద్​ ఎల్బీ స్టేడియంలో నేడు జరగనున్న ఇఫ్తార్​  ఏర్పాట్లను మంత్రులు మహమూద్​ అలీ, కొప్పుల ఈశ్వర్​లతో పాటు ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్​లు పరిశీలించారు.

author img

By

Published : Jun 2, 2019, 4:39 AM IST

Updated : Jun 2, 2019, 7:22 AM IST

ఇఫ్తార్​ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
ఇఫ్తార్​ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

ముఖ్యమంత్రి కేసీఆర్ నంబర్ వన్ సెక్యులర్ సీఎం అని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రశంసించారు. హైదరాబాద్​ ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఇఫ్తార్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్​లు సంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు 8 వేల మంది వీఐపీలు ఇఫ్తార్ విందుకు హాజరవుతారని హోంమంత్రి తెలిపారు. రంజాన్ పండగ సందర్బంగా రూ.16 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. వీటిని మసీదుల అభివృద్ధికి వినియోగిస్తామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ముస్లిం సోదరులను రంజాన్​లో భాగస్వామ్యం చేసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కుల, మతాలకు అతీతంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని అన్ని పండుగులను ప్రభుత్వ పరంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని మంత్రి కొప్పుల ఈశ్వర్​ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: గవర్నర్​ ఇఫ్తార్​ విందు... కేసీఆర్​, జగన్​ హాజరు

sample description
Last Updated : Jun 2, 2019, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.