ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ... హైదరాబాద్ నాంపల్లిలోని విద్యాభవన్ ముందు మహాధర్నా నిర్వహించారు. రాష్టవ్యాప్తంగా 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పదేళ్లుగా 1,354 మంది పనిచేస్తున్నట్లు వారు తెలిపారు. పీజీ మెరిట్ ద్వారా ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసిందని... ఆ నిర్ణయంతో తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని తమను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: 'నామీద కేసు ఎత్తివేయించే బాధ్యత కేసీఆర్‌దే'