'నడవటానికి హక్కు' అనే నినాదంతో ప్రతి శనివారం జీహెచ్ఎంసీ అధికారులు ఈ కూల్చివేతలు చేపట్టారు. మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో 2లక్షల 50 వేల ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను గుర్తించగా 15 వేల వరకు మోక్షం కలిగింది. మొదటగా ప్రధాన రహదారులపై శాశ్వతంగా కట్టిన ఆక్రమణలను తొలగిస్తున్నారు. మళ్లీ నిర్మిస్తే ఉపేక్షించేది లేదని కేసులు నమోదు చేస్తామని విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరిస్తోంది.