.
తెలంగాణ శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టారు. రైతుల పరిస్థితి చక్కబడేంత వరకు అన్ని విధాల వారిని ఆదుకుంటామని కేసీఆర్ తెలిపారు.
రైతు రుణమాఫీకు రూ.6,000కోట్లు
గత ఎన్నికల్లో పంట రుణాల మాఫీ కోసం ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ ఏడాది బడ్జెట్లో రైతు రుణమాఫీకోసం రూ.6,000 కోట్లు ప్రతిపాదించారు.
రైతు బంధుకు 12,000 కోట్లు
రైతులు అప్పుల ఊబిలో పడకుండా గత పాలనాసమయంలో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టాం. ఏటా ఎకరానికి 8వేల రూపాయలను అందజేశాం. ఈ ఏడాది ఎకరానికి 10వేల రూపాయలకు పెంచుతూ రైతు బంధు పథకం కోసం రూ.12,000 కోట్లు ప్రతిపాదించారు సీఎం కేసీఆర్.
రైతు బీమాకు రూ.650 కోట్లు
దురదృష్టవశాత్తు ఏ రైతైనా మరణిస్తే వారి కుటుంబానికి సాయం చేసేందుకు రైతుబీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ ఏడు బడ్జెట్లో రైతుల తరఫున బీమాకిస్తీ కట్టడం కోసం రూ. 650 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)