ETV Bharat / state

ఇంజినీరింగ్​ రుసుముల పెంపుపై కసరత్తు వేగవంతం - Engineering Fees

ఇంజినీరింగ్ కాలేజీల రుసుముల పెంపుపై కసరత్తు కొనసాగుతోంది. రోజుకు కొన్ని కాలేజీల యాజమాన్యాలతో టీఏఎఫ్ఆర్​సీ చర్చలు జరుపుతోంది. ఈనెల 5లోగా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో... టీఏఎఫ్ఆర్​సీ ఖరారు చేసిన రుసుములను యాజమాన్యాలు సవాల్ చేయకపోవచ్చునని అధికారులు భావిస్తున్నారు.

ఇంజినీరింగ్​ రుసుముల పెంపుపై కసరత్తు వేగవంతం
author img

By

Published : Jul 2, 2019, 9:50 AM IST

ఇంజినీరింగ్ కళాశాలల రుసుముల ఖరారు ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. తాత్కాలికంగా సుమారు 15 నుంచి 20 శాతం పెంచేందుకు రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ ఇప్పటికే అంగీకరించింది. హైకోర్టును ఆశ్రయించి తాత్కాలికంగా భారీ ఫీజులు వసూలు చేసేందుకు అనుమతి పొందిన కాలేజీలతో టీఏఎఫ్ఆర్​సీ చర్చలు జరుపుతోంది. నిన్న సుమారు ఇరవై కాలేజీల యాజమాన్యాలతో చర్చించి... పెంపుపై రాత పూర్వకంగా హామీ తీసుకుంది. ఇవాళ, రేపు మరికొన్ని కళాశాలలతో మాట్లాడి ఫీజులు ఖరారు చేయనుంది. సుమారు 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈనెల 4న ఉత్తర్వులు!

కోర్టుకు వెళ్లని సుమారు 108 కాలేజీల యాజమాన్యాలతో ఇటీవల సమావేశం నిర్వహించారు. పెంపుతో కలిసి ప్రతిపాదిత ఫీజు 50వేల లోపు ఉంటే... ప్రస్తుత రుసుముపై 20 శాతం తాత్కాలికంగా పెంచేందుకు ఏఎఫ్ఆర్​సీ అంగీకరించింది. పెంపుతో కలిసి ప్రతిపాదిత ఫీజు 50వేలు లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే ఇప్పటి వరకు ఉన్న ఫీజుపై 15 శాతం తాత్కాలికంగా పెంచాలని నిర్ణయించి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అన్నీ కలిపి ఈనెల 4న సర్కారు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఈనెల 5 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. విద్యార్థులు ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉన్నందున ఫీజుల వ్యవహారం కొలిక్కి తెచ్చేందుకు టీఏఎఫ్​ఆర్​సీ ప్రక్రియను వేగవంతం చేసింది.

హైకోర్టును ఆశ్రయించినా!

మరోవైపు ఫీజుల పెంపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులు.. విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు టీఏఎఫ్ఆర్​సీ, ఉన్నత విద్యా మండలికి కూడా ఊరట కలిగిస్తోంది. టీఏఎఫ్ఆర్​సీ వివిధ కోణాల్లో కసరత్తు చేసి ఫీజులు ఖరారు చేసినప్పటికీ... యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయిస్తాయేమోనన్న ఆందోళన ఉండేది. అయితే తాజా తీర్పుతో ఆ అవకాశం ఉండకపోవచ్చున్నని ఒకవేళ అటువంటి ప్రయత్నం చేసినా.. ప్రయోజనం ఉండదని అధికారులు భావిస్తున్నారు.

అప్పీలుకు లక్షరూపాయలు

మరోవైపు అప్పీలు రుసుమును కూడా భారీగా పెంచారు. ఫీజుపై అభ్యంతరాలు ఉంటే టీఏఎఫ్ఆర్​సీకి అప్పీలు చేసేందుకు ఇప్పటి వరకు 10వేల రూపాయల రుసుము చెల్లించాల్సి ఉండేది. అప్పీలు రుసుమును లక్ష రూపాయలకు పెంచుతూ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఒకసారి ఫీజులు ఖరారైన తర్వాత మళ్లీ మార్పులు చేయాల్సిన అవసరం రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Intro:Body:

engg

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.