ETV Bharat / state

దోస్త్​ ప్రత్యేక నోటిఫికేషన్ - degree students

ఇంటర్​ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం దోస్త్ ప్రత్యేక విడత నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ ప్రవేశాల్లో చేరేందుకు రేపటి నుంచి ఈనెల 21 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని విద్యార్థులకు దోస్త్ కన్వీనర్​ ఆచార్య లింబాద్రి సూచించారు.

సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారికి దోస్త్​ ప్రత్యేక నోటిఫికేషన్
author img

By

Published : Jul 16, 2019, 9:35 PM IST

Updated : Jul 17, 2019, 11:36 AM IST

ఇంటర్​ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం దోస్త్ ప్రత్యేక విడత నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ ప్రవేశాల్లో చేరేందుకు రేపటి నుంచి ఈనెల 21 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. రేపటి నుంచి ఈనెల 22 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని కన్వీనర్ ఆచార్య లింబాద్రి తెలిపారు. ఈనెల 26న ప్రత్యేక విడత సీట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. జులై 26 నుంచి 29 వరకు కాలేజీల్లో చేరేందుకు గడువు ఉంటుంది. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ వెబ్ ఆప్షన్లు నమోదు చేయని వారు.. వెబ్ ఆప్షన్లు ఇచ్చినప్పటికీ సీటు దక్కని వారు కూడా ప్రత్యేక విడతలో మరోసారి ప్రయత్నం చేయవచ్చని తెలిపారు. సీటు వచ్చినప్పటికీ కాలేజీలకు ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని విద్యార్థులు... మళ్లీ 400 రూపాయలు చెల్లించి తాజాగా దోస్త్​లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కన్వీనర్ పేర్కొన్నారు. సీటు వచ్చి కాలేజీల్లో చేరిన విద్యార్థులు... మెరుగైన సీటు కోసం ప్రయత్నించాలనుకుంటే... మూడో విడత వెబ్ ఆప్షన్లనే మళ్లీ సమర్పించాల్సి ఉంటుందని ఆచార్య లింబాద్రి స్పష్టం చేశారు.

ఇంటర్​ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారికి దోస్త్​ ప్రత్యేక నోటిఫికేషన్

ఇవీ చూడండి: రాష్ట్రంలో అలముకుంటున్న కరవు ఛాయలు

Last Updated : Jul 17, 2019, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.