ETV Bharat / state

విచారణకు హాజరు కావాల్సిందిగా శివాజీకి నోటీసులు

ఇవాళ ఉదయం నటుడు శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలంద మీడియాకేసులో ఇప్పటికే లుకౌట్ నోటీసులు ఉన్నందున... ఇమ్మిగ్రేషన్ అధికారులు సైబర్ క్రైం పోలీసులకు సమాచారం అందించారు. శివాజీని అదుపులోకి తీసుకున్న పోలీసులు నోటీసులు ఇచ్చి ఈ నెల 11న హాజరు కావల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

విచారణకు హాజరు కావాల్సిందిగా శివాజీకి నోటీసులు
author img

By

Published : Jul 3, 2019, 11:19 AM IST

Updated : Jul 3, 2019, 1:57 PM IST

విచారణకు హాజరు కావాల్సిందిగా శివాజీకి నోటీసులు

అలంద మీడియా కేసుకు సంబంధించి నటుడు శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలిపెట్టారు. అమెరికా వెళ్లేందుకు తెల్లవారుజామున శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపేశారు. అలంద మీడియా కేసులో సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసిన కారణంగా దేశం విడిచి వెళ్లేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతించలేదు. వెంటనే సైబరాబాద్ పోలీసులకు సమాచారమిచ్చారు. విమానాశ్రయం వద్దకు చేరుకున్న సైబర్ క్రైం పోలీసులు శివాజీని అదుపులోకి తీసుకొని... పోలీస్ స్టేషన్​కు తరలించారు.

అలంద మీడియా వ్యవహారంలో శివాజీపై కేసు

అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు నెలల క్రితం శివాజీపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా పలుసార్లు నోటీసులు కూడా జారీ చేశారు. కానీ శివాజీ మాత్రం స్పందించలేదు. తనపై ఉన్న కేసులను సవాల్ చేస్తూ... హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో ఉన్నందును సైబర్ క్రైం పోలీసులు శివాజీకి నోటీసులు ఇచ్చి... తిరిగి పంపించేశారు. ఈ నెల 11వ తేదీన తమ ముందు హాజరు కావాలని పేర్కొన్నారు. లుక్ అవుట్ సర్క్యులర్ ఉన్నందున విదేశాలకు వెళ్లొద్దని కూడా సూచించారు.

ఇవీ చూడండి: అటవీశాఖ అధికారి దాడి ఘటనపై మంత్రుల భేటీ

Last Updated : Jul 3, 2019, 1:57 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.