తెలంగాణ రాష్ట్ర సమితిలో సీఎల్పీ విలీన ప్రక్రియ పూర్తైంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన 19 మందిలో 12 మంది ఎమ్మెల్యేలు తమను తెరాస సభ్యులుగా గుర్తించాలన్న వినతిని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. 12 మందిలో 11 మంది గతంలోనే అధికార పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా తాండూర్ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డితో కలిసి 12 మంది సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో సమావేశమై చేరికను అధికారికంగా ధ్రువీకరించారు.
రోహిత్ రెడ్డి చేరికతో స్పష్టత..
మహేశ్వరం నుంచి సబితారెడ్డి, ఎల్లారెడ్డి నుంచి జాజాల సురేందర్, పినపాక నుంచి రేగ కాంతారావు, పాలేరు నుంచి కందాల ఉపేందర్ రెడ్డి, ఇల్లందు నుంచి హరిప్రియ నాయక్, కొత్తగూడెం నుంచి వనమా వెంకటేశ్వర రావు, నకిరేకల్ నుంచి చిరుమర్తి లింగయ్య, ఎల్బీనగర్ నుంచి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆసిఫాబాద్ నుంచి ఆత్రం సక్కు, కొల్లాపూర్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి, భూపాల్‌పల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డిలు ఇంతకుముందే తెరాసలో చేరనున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. రోహిత్ రెడ్డి కూడా తెరాసలో చేరుతున్నట్లు, 12 మంది సంతకాలతో కూడిన లేఖను సభాపతికి అందించారు.
హోదా గల్లంతు..
కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోవాలంటే... గెలిచిన సభ్యుల్లో మూడింట రెండొంతులు తెరాసలో చేరాలి. 19 మందిలో 13 మంది ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరాలి. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా గెలిచిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి... హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. ఫలితంగా కాంగ్రెస్ బలం 18కి, సీఎల్పీ విలీనానికి కావాల్సిన సంఖ్య కూడా 12కు పడిపోయింది. రోహిత్ రెడ్డి చేరికతో ఆ సమస్య తీరింది. వీరంతా స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేయడం.. దానికి సభాపతి ఆమోదం... నోటిఫికేషన్ విడుదలతో విలీన ప్రక్రియ పూర్తై కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా గల్లంతైంది.
ఇక నుంచి ప్రతిపక్షం ఎంఐఎం...?
119 మంది సభ్యులు గల శాసనసభలో ఇప్పటికే తెరాసకు 90 మంది సభ్యులుండగా... 12మంది కాంగ్రెస్ సభ్యుల చేరికతో 102కి చేరింది. సభలో కాంగ్రెస్ బలం 6కు పడిపోయింది. తెరాస తర్వాత ఏడుగురు సభ్యులతో రెండో పెద్ద పార్టీగా... ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా దక్కనుంది.
సీఎల్పీ విలీనం పూర్తి... హోదా గల్లంతు
కాంగ్రెస్ శాసనసభాపక్షానికి భారీ షాక్. రెబల్స్‌గా ఉన్న ఎమ్మెల్యేలు అధికారికంగా కారెక్కారు. ఫిరాయింపు నిరోధక చట్టంతో తమ నిర్ణయానికి సమస్యలు రాకుండా... మూడింట రెండోవంతు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరారు. 12 మంది సభ్యులు.. తమను తెరాస సభ్యులుగా గుర్తించాలని సభాపతిని కలిసి వినతిపత్రం అందించారు. స్పీకర్ ఆమోదముద్రతో ఈ లాంఛనం పూర్తైంది. ఈ ఘటనతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం హోదా గల్లంతైంది.
తెలంగాణ రాష్ట్ర సమితిలో సీఎల్పీ విలీన ప్రక్రియ పూర్తైంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన 19 మందిలో 12 మంది ఎమ్మెల్యేలు తమను తెరాస సభ్యులుగా గుర్తించాలన్న వినతిని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. 12 మందిలో 11 మంది గతంలోనే అధికార పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా తాండూర్ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డితో కలిసి 12 మంది సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో సమావేశమై చేరికను అధికారికంగా ధ్రువీకరించారు.
రోహిత్ రెడ్డి చేరికతో స్పష్టత..
మహేశ్వరం నుంచి సబితారెడ్డి, ఎల్లారెడ్డి నుంచి జాజాల సురేందర్, పినపాక నుంచి రేగ కాంతారావు, పాలేరు నుంచి కందాల ఉపేందర్ రెడ్డి, ఇల్లందు నుంచి హరిప్రియ నాయక్, కొత్తగూడెం నుంచి వనమా వెంకటేశ్వర రావు, నకిరేకల్ నుంచి చిరుమర్తి లింగయ్య, ఎల్బీనగర్ నుంచి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆసిఫాబాద్ నుంచి ఆత్రం సక్కు, కొల్లాపూర్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి, భూపాల్‌పల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డిలు ఇంతకుముందే తెరాసలో చేరనున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. రోహిత్ రెడ్డి కూడా తెరాసలో చేరుతున్నట్లు, 12 మంది సంతకాలతో కూడిన లేఖను సభాపతికి అందించారు.
హోదా గల్లంతు..
కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోవాలంటే... గెలిచిన సభ్యుల్లో మూడింట రెండొంతులు తెరాసలో చేరాలి. 19 మందిలో 13 మంది ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరాలి. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా గెలిచిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి... హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. ఫలితంగా కాంగ్రెస్ బలం 18కి, సీఎల్పీ విలీనానికి కావాల్సిన సంఖ్య కూడా 12కు పడిపోయింది. రోహిత్ రెడ్డి చేరికతో ఆ సమస్య తీరింది. వీరంతా స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేయడం.. దానికి సభాపతి ఆమోదం... నోటిఫికేషన్ విడుదలతో విలీన ప్రక్రియ పూర్తై కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా గల్లంతైంది.
ఇక నుంచి ప్రతిపక్షం ఎంఐఎం...?
119 మంది సభ్యులు గల శాసనసభలో ఇప్పటికే తెరాసకు 90 మంది సభ్యులుండగా... 12మంది కాంగ్రెస్ సభ్యుల చేరికతో 102కి చేరింది. సభలో కాంగ్రెస్ బలం 6కు పడిపోయింది. తెరాస తర్వాత ఏడుగురు సభ్యులతో రెండో పెద్ద పార్టీగా... ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా దక్కనుంది.
TAGGED:
clp merge in trs