ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఆగస్టు నెలను హాజరు మహోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. విద్యార్థులు వంద శాతం పాఠశాలలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఆదేశించారు. స్వయం సహాయక బృందాలు, మండల, జిల్లా సమాఖ్యలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. విద్యార్థులను వివిధ అంశాలపై ప్రోత్సహించాలని.. పాఠశాలల్లో బాలల సంఘాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీ రోజూ పాఠశాలకు హాజరయ్యే విద్యార్థులను సత్కరించాలని.. దాతల సహకారంతో బహుమతులు ఇచ్చి ప్రోత్సహించాలని ఆయన చెప్పారు. పిల్లలను ఆకర్షించేలా పాఠశాల ఆవరణను రూపొందించాలని జనార్దన్ రెడ్డి ఆదేశించారు.
ఇవీ చూడండి: స్వర్ణోత్సవ సంబురాల్లో క్షిపణుల కేంద్రం