ETV Bharat / state

నేడు రాష్ట్రానికి కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ రాక

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ నేడు రాష్ట్రానికి రానున్నారు. రేపు జరిగే మూడు బహిరంగ సభలకు హాజరుకానున్నారు. ఎన్నికల నోటిఫికేషన్​ అనంతరం కాంగ్రెస్​ తలపెట్టిన భారీ కార్యక్రమాలు రాహుల్​ సభలే.

author img

By

Published : Mar 31, 2019, 5:30 AM IST

Updated : Mar 31, 2019, 7:08 AM IST

రేపు ఉదయం హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంటు అభ్యర్ధులతో భేటీ

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ నేడు రాష్ట్రానికి రానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని రాత్రికి హైదరాబాద్‌ చేరుకుంటారు. అనంతరం శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలోని హోటల్‌లో బస చేస్తారు. రేపు ఉదయం హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థులతో సమవేశమవుతారు. నియోజకవర్గాల్లో తాజా పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.

మూడు సభలకు హాజరు...

మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్​​లో జహీరాబాద్‌కు చేరుకుని బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం వనపర్తిలో జరిగే ప్రచారసభకు హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు నల్గొండ జిల్లా హుజూర్​నగర్‌లో సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5.50 గంటలకు హైదరాబాద్‌ చేరుకుని దిల్లీకి పయనమవుతారు.

భారీ ఏర్పాట్లు..
రాహుల్​ సభలను కాంగ్రెస్​ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎన్నికల నోటిఫికేషన్​ అనంతరం రాష్ట్రంలో పార్టీ తరఫున జరుగుతున్న భారీ కార్యక్రమం రాహుల్​ పర్యటనే. ఏప్రిల్​ ఎనిమిదిన ఒకట్రెండుసభల్లో పాల్గొనేందుకు రాహుల్​ అంగీకరించినట్లు సమాచారం. గతంలో రాహుల్​ సభలు ఏర్పాటు చేయని నియోజకవర్గాల్లో మిగిలిన సభలు నిర్వహించాలని హస్తం పార్టీ యోచిస్తొంది.

ఇవీ చూడండి:ఈసీ నిర్ణయం ప్రకారమే ఇందూరు ఎన్నికలు

Intro:hyd_tg_tdr1_30_ktr_roadshow_ab_c23

తెలంగాణలో లో బిజెపి మీ కాంగ్రెస్ పార్టీలకు పనేమీ లేదని టిఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ర్ విమర్శించారు వికారాబాద్ జిల్లా తాండూరులో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం షో నిర్వహించారు ఇదే సందర్భంగా ఆయన మాట్లాడారు

Body:కెసిఆర్ కు కు కేంద్రం లో లో కొత్త పదవి వస్తే రావచ్చేమో అని ఆయన పేర్కొన్నారు నరేంద్ర మోడీ తెలంగాణ రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టి ఇ ప్రధానమంత్రి ఇ కిసాన్ యోజన నా పేరు పెట్టుకున్నారని విమర్శించారు 75 ఏళ్లుగా కాంగ్రెస్ బిజెపి మీ పార్టీలు అధికారం చేపట్టి ఇ దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు రెండు ఎంపీ మీ స్థానాలతో తెలంగాణ సాధించిన కేసీఆర్ ఆర్ 16 ఎంపీలతో ఇంకెంత సాధిస్తారు చూపిస్తారని పేర్కొన్నారు

Conclusion:జాతీయ పార్టీలతో జాతి ఇ ఆగం అయిపోతుందని బిజెపి-కాంగ్రెస్ ల కు ఓటు వేసి ఇ మనం భాగం కావాలని పేర్కొన్నారు చేవెళ్ల ఎంపీ తెరాస అభ్యర్థి రంజిత్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించి ఢిల్లీకి పంపించాలని ఆయన సూచించారు

byte... కేటీఆర్ ర్ తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు
Last Updated : Mar 31, 2019, 7:08 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.