ఏప్రిల్ ఒకటిన రాష్ట్రానికి రాహుల్ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ ఒకటిన రాహుల్ రాష్ట్రానికి రానున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు జహీరాబాద్లో జరిగే ప్రచార సభకు హాజరవుతారు. అనంతరం నాగర్కర్నూల్ నియోజకవర్గంలోని వనపర్తిలో రెండు గంటలకు జరిగే సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి నల్గొండ చేరుకుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు హుజూర్నగర్ సభలో ప్రసంగిస్తారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి:'విద్యావంతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది'