భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ముసలమడుగు గ్రామపంచాయతీ రామాపురం గ్రామానికి చెందిన గిరిజన మహిళ లక్ష్మికి పురిటి నొప్పులు రావడం వల్ల బూర్గంపాడు మండలంలోని మొరంపల్లి బంజరు పీహెచ్సీకి తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉందని అక్కడ వైద్య సిబ్బంది ఆమెను ఆస్పత్రిలో చేర్పించుకోలేదు. భద్రాచలం ఆస్పత్రికి రిఫర్ చేశారు.
దీంతో పురిటినొప్పులతో అక్కడినుంచి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో తీసుకువెళ్తుండగా లక్ష్మి మార్గమధ్యలోనే ఆటోలో ప్రసవించింది. మగబిడ్డ పుట్టిన వెంటనే చనిపోయాడు. బంజరు గ్రామంలో ఆస్పత్రి సిబ్బంది సరైన వైద్యం అందించకపోవడం వల్లే బాబు మృతి చెందాడని లక్ష్మి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాలింత లక్ష్మి భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఇవీ చూడండి: భూతవైద్యం పేరుతో చిత్రహింసలు.. ప్రాణాపాయ స్థితిలో బాధితురాలు