ETV Bharat / state

నిస్వార్థ నాయకుడిని కోల్పోయాం: తమ్మినేని - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పర్యటించారు. ఈ సందర్భంగా సున్నంవారిగూడెంలో ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య సంతాప సభలో పాల్గొని నివాళులు అర్పించారు.

We lost a selfless leader: Tammineni
నిస్వార్థ నాయకుడిని కోల్పోయాం: తమ్మినేని
author img

By

Published : Sep 7, 2020, 8:51 AM IST

ఎందరికో ఆదర్శవంతంగా నిలిచిన నిస్వార్థ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యను కోల్పోవడం బాధాకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విచారం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సున్నంవారిగూడెంలో ఆదివారం నిర్వహించిన సున్నం రాజయ్య సంతాప సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

రాజయ్య కుటుంబానికి పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని వీరభద్రం పేర్కొన్నారు. ఎర్రజెండా నీడలో మరణించిన రాజయ్య నిజాయతీకి నిదర్శనమని, పార్టీకి తీరని లోటన్నారు. కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

అనంతరం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జిని భద్రాచలంలో కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేసినట్లు నాయకులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: శత్రువు కన్నుగప్పి సరిహద్దుకు చేర్చే రహదారి సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.