ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్లను నియమిస్తోంది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ఆర్టీసీ డిపో పరిధిలో ఉద్యోగాల కోసం యువతీ యువకులు పోటీ పడుతున్నారు. సుమారు 500 మంది తెల్లవారుజామున డిపోకి చేరుకొని విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని... తమకు అవకాశం కల్పించాలని కోరారు. విధులు నిర్వహించేందుకు వచ్చిన వారి పేర్లు అధికారులు నమోదు చేసుకొని క్రమపద్ధతిలో విధులకు పంపిస్తున్నారు.
ఇదీ చూడండి: సమ్మెలో కార్మికలోకం... సర్కారు చర్చల సంకేతం!