భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(bhadradri kothagudem) గుండాల మండలం లింగగూడెంలో రోడ్డువైపున ఇళ్లలో కొన్ని రోజులుగా కోడిగుడ్లు, కోళ్లు మాయవతున్నాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి వాటిని ఎవరో ఎత్తుకెళ్తున్నట్లు గమనించారు. ఇది దొంగల పని, పిల్లుల పని కాదని నిర్ధారించుకుని... నిఘా పెట్టారు.
కారు చీకటి క్రమంగా అలుముకుంటుంది. దొంగ కోసం స్థానికులు గోడమాటున నక్కి కూర్చున్నారు స్థానికులు. ఇంతలో అక్కడికి మెల్లగా పాకుకుంటూ ఓ భారీ కొండ చిలువ వచ్చింది. రోజూ కోళ్లు, కోడిగుడ్లు తింటూ.. బాగా అలవాటుపడిన ప్రదేశానికి చేరుకుంది. కోళ్లు తినడానికి వచ్చిన కొండచిలువను చూసిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే తేరుకుని తలో కర్ర, గొడ్డలి తీసుకుని కొండ చిలువను కొట్టి చంపారు(villagers kill a python).
ఇదీ చూడండి: Lovers Suicide in Gadwal : రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య