భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారామస్వామి ఆలయంలో వసంత పక్ష ప్రయుక్త సన్నాహక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆలయం బయట చేయాల్సిన ఉత్సవాలన్నీ లాక్ డౌన్‌తో లోపలే నిర్వహిస్తున్నారు.
ఆదివారం భద్రాద్రి రామయ్యకు గోదావరి నదిలో తెప్పోత్సవం జరగాల్సి ఉండగా ఈ ఉత్సవాన్ని ఆలయం లోపలే నిర్వహించారు. ఆలయంలోని నిత్య కల్యాణ మండపం వద్ద ఒక పెద్ద పాత్రలో గోదావరి జలాలను ఆవాహనం చేసి తెప్పోత్సవం నిర్వహించారు. అర్చకులను తప్ప ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు.
ఇదీ చదవండి: కరోనాపై ఆయుర్వేదాస్త్రం.. ఇవి తింటే చాలు