భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజక వర్గ పరిధిలోని టేకులపల్లి మండలం బొమ్మనపల్లి వద్ద 12 లక్షల విలువైన గంజాయిని టేకులపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఏపీ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కిషోర్ కుమార్, కొమరారం చెందిన బానోతు రమేశ్ బొమ్మనపల్లి ప్రాంతం గుండా గంజాయిని ఆటోలో తరలిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.
తమను చూసి ఆటో వదిలేసి డ్రైవర్, మరో వ్యక్తి పారిపోయారని వారు వెల్లడించారు. ఈ తనిఖీల్లో మొత్తం 12 లక్షల విలువైన గంజాయితో పాటు మూడు బైకులు, రెండు చరవాణీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్