భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఆర్టీసీ కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. పలు పార్టీల నాయకులతో కలిసి కనిపించిన వారినల్లా భిక్ష అడిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసేందుకే సమ్మెపై కఠిన వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. సమ్మెను విరమింపజేసే ప్రయత్నాలు ఇప్పటివరకు చేయకపోవడం విచారకరమన్నారు. పూజలు పురస్కారాలు చేస్తూ బాబాలకు స్వామీజీలకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేసే ముఖ్యమంత్రి కార్మికుల కష్టాలను తెలుసుకోవడం లేదని వాపోయారు.
ఇవీ చూడండి: 'ఆర్టీసీ సమ్మెకు ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్టు సంపూర్ణ మద్దతు'