ETV Bharat / state

భద్రాచలంలో ఆర్టీసీ కార్మికుల మానవహారం - tsrtc employees rally in bhadrachalam

భద్రాచలంలో ఆర్టీసీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య హాజరై... కార్మికులకు మద్దతు తెలిపారు. అనంతరం తెరాస నాయకుడు వెంకట్రావ్ ఇంటిని ముట్టడించారు.

భద్రాచలంలో ఆర్టీసీ కార్మికుల మానవహారం
author img

By

Published : Nov 11, 2019, 4:26 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆర్టీసీ కార్మికులు ర్యాలీ నిర్వహించి, అంబేడ్కర్ చౌరస్తాలో మానవహారం చేపట్టారు. అనంతరం పొదెం వీరయ్య ఆధ్వర్యంలో... తెరాస రాష్ట్ర కార్యదర్శి తెల్ల వెంకట్రావ్ ఇంటిని ముట్టడించారు. దాదాపు గంటసేపు ఆయన ఇంటి ముందు బైఠాయించి ధర్నా చేశారు. కార్మికులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు రావాలని... అందరూ విధుల్లో చేరాలని వెంకట్రావ్​ ఆకాంక్షించారు.
ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం కేసీఆర్​ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే పొదెం వీరయ్య విమర్శించారు. ముఖ్యమంత్రి స్పందించి... కార్మికుల సమస్యలు పరిష్కరించి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భద్రాచలంలో ఆర్టీసీ కార్మికుల మానవహారం

ఇదీ చూడండి: ఎంఎంటీఎస్​ ప్రమాదంలో 12కు చేరిన క్షతగాత్రుల సంఖ్య

Intro:బైట్

Body:పొదెం వీరయ్య

Conclusion:ఎమ్మెల్యే భద్రాచలం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.