భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలక ఎన్నికల్లో తెరాస నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. మున్సిపాలిటీలో తెరాసను గెలిపిస్తే.. పట్టణాన్ని దత్తత తీసుకోనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపినట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాత మధు, ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ వెల్లడించారు.
తెరాసను గెలిపిస్తే బస్ డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రెబల్ అభ్యర్థులు పార్టీ గుర్తులతో ప్రచారం చేయకూడదని హెచ్చరించారు. 24 వార్డుల్లో 24మంది తెరాస అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నట్లు ప్రకటించారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: కంపు కొడుతున్న మున్సిపాలిటీలు