భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం పంచాయతీలో మారుమూల గ్రామం బట్టుగూడెంలో...మహిళ పురిటి నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడింది. గ్రామానికి సరైన దారి లేకపోవడంతో స్థానిక యువకులు... గర్భిణీని మోసుకుంటూ ఆరు కిలోమీటర్లు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆటో ద్వారా …. ఏఎన్ఎం రాజేశ్వరి సాయంతో సత్యనారాయణపురం వైద్యశాలకు తరలించారు. ఏఎన్ఎం చేసిన సాయానికి పలువురు అభినందనలు తెలిపారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో మరో 52 కరోనా పాజిటివ్ కేసులు