ETV Bharat / state

సింగరేణి బొగ్గు గనిలో పెద్దపులి సంచారం.. భయంలో జనం - మణుగూరు వార్తలు

రాష్ట్రంలో పెద్ద పులుల సంచారం కలకలం రేపుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలో కూడా సంచారిస్తున్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా ఓసీ-2 బొగ్గు గనిలో గురువారం తెల్లవారుజామున పెద్ద పులి సంచరించింది. పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Tiger wandering in a coal mine at manuguru in badradri kothagudem district
మణుగూరు సింగరేణి బొగ్గు గనిలో పెద్ద పులి సంచారం
author img

By

Published : Dec 10, 2020, 1:00 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా ఓసీ-2 బొగ్గు గనిలో గురువారం తెల్లవారుజామున పెద్ద పులి సంచరించింది. ఓబీ గుట్ట మీద నుంచి వచ్చిన పెద్ద పులి వాటర్ ఫిల్లింగ్ ప్రాంతం వద్ద దాహార్తిని తీర్చుకొని అడవిలోకి వెళ్లిపోయింది. పెద్ద పులి సంచరించడాన్ని అక్కడ పనిచేసే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు వీరయ్య కళ్లారా చూశారు. భయభ్రాంతులకు గురై వెంటనే వేరే ప్రదేశానికి వెళ్లి పోయారు.

సమాచారం అందుకున్న ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ వేణుబాబు, రేంజర్ ప్రసాదరావు సింగరేణి అధికారులతో కలిసి పులి సంచరించిన ప్రదేశాన్ని పరిశీలించారు. పులి పాద ముద్రలను సేకరించారు. గత 20 రోజులుగా పినపాక నియోజకవర్గంలో పులి సంచరిస్తుందని.. పులికి ఎవరు హాని తల పెట్టవద్దని ఎఫ్డీవో సూచించారు.

ఇదీ చదవండి: కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌లో 12 పెద్ద పులులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.