ETV Bharat / state

పినపాక నియోజకవర్గంలో కరోనా పంజా.. ఒక్కరోజే ముగ్గురు మృతి - corona deaths in pinapaka constituency

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా విశ్వరూపం కొనసాగుతోంది. పినపాక నియోజకవర్గంలో ఒక్క రోజే ముగ్గురు వృద్ధులు కొవిడ్​ బారిన పడి మృతి చెందారు.

corona deaths in pinapaka
కరోనాతో వృద్ధులు మృతి
author img

By

Published : Apr 21, 2021, 8:25 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, పినపాక మండలాల్లో కరోనా బారిన పడి ముగ్గురు మృతి చెందారు. మణుగూరు పట్టణంలోని సుందరయ్య నగర్​కు చెందిన వృద్ధ దంపతులు గత ఐదు రోజుల క్రితం కొవిడ్​ బారిన పడ్డారు. భర్తకు గుండె సంబంధిత వ్యాధితో పాటు ఇతర అనారోగ్య సమస్యలున్నాయి. ఆయన పరిస్థితి విషమించి ఈ రోజు మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పురపాలక కమిషనర్ నాగ ప్రసాద్.. సిబ్బంది, కుటుంబ సభ్యుల సమక్షంలో పీపీఈ కిట్లు ధరించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

సమితి సింగారం గ్రామానికి చెందిన వృద్ధురాలికి(60) ఈ నెల 12న కరోనా సోకింది. దానికి తోడు ఆస్తమా వ్యాధి ఉండటంతో 19న ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. పినపాక మండలానికి చెందిన వృద్ధురాలు(65) మహమ్మారి బారిన పడి మృత్యు ఒడికి చేరింది.

ఇదీ చదవండి: దారుణం: తండ్రిని పొడిచి చంపిన తనయుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.