ETV Bharat / state

ఆహారం, ఆరోగ్యంపై గవర్నర్ బృందం అవగాహన

ఆదిమ గిరిజన తెగలలో పౌష్టికాహార లోపం నివారణపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం భద్రాది కొత్తగూడెం జిల్లా.. దమ్మపేట మండలం పూసుకుంట కొండరెడ్డి గ్రామంలో పర్యటించింది. గ్రామస్థులకు ఆహారం, ఆరోగ్యం మొదలగు విషయాలపై అవగాహన కల్పించారు.

governor team visit tribal villages
పౌష్టికాహార లోపం నివారణపై అవగాహన
author img

By

Published : Apr 8, 2021, 2:14 AM IST

రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందర్యరాజన్‌ ఆదిమ గిరిజన తెగలలో పౌష్టికాహారం లోపం నివారణపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం దమ్మపేట మండలం పూసుకుంట కొండరెడ్డి గ్రామంలో పర్యటించింది. కొండరెడ్లలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు గవర్నర్‌ తమిళిసై.. రెడ్​ క్రాస్‌ ఆధ్వర్యంలో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌, ఈఎస్‌ఐ వైద్య కళాశాల సహకారంతో ప్రత్యేక కార్యక్రమం చెప్పటినట్లు గవర్నర్‌ జాయింట్‌ సెక్రటరీ‌ భవాని శంకర్‌ తెలిపారు.

ఈ కార్యక్రమం అమలుకోసం రాష్ట్రంలోని మూడు జిల్లాలోని ఆరు గిరిజన ఆదిమ తెగల గ్రామాల్ని ఎంపిక చేసుకున్నట్లు ఆయన చెప్పారు. గర్భిణీలకి, పిల్లలకు పోషకాహారం సరిగ్గా అందకపోవడం కారణంగానే వారిలో ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు సర్వే ద్వారా తెలిసిందన్నారు. కొండరెడ్లలో పౌష్టికాహార లోపాల మీద ఒక అంచనాకు వచ్చి వాటిని అధిగమించేందుకు కార్యాచరణను గవర్నర్‌ మార్గదర్శకత్వంలో చేపట్టడం జరుగుతుందని ఆయన వివరించారు.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ రీసెర్చ్ స్కాలర్ శివుడు, ఈఎస్ఐ వైద్య కళాశాల వైద్యులు డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ రంజిత్ గ్రామస్థులకు ఆహారం, ఆరోగ్యం మొదలగు విషయాలపై అవగాహన కల్పించనట్లు చెప్పారు. పూసుకుంట, గోగులపూడి గ్రామాలను ఎంపిక చేయడం ఆనందంగా ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెడ్​క్రాస్ ఛైర్మన్ డా. కాంతారావు అన్నారు. రెడ్​క్రాస్ శాఖకు, గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామస్థులకు హెల్త్ హైజినిక్ కిట్లు, మాస్కులు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి: లైవ్ వీడియో: మాట్లాడ్డానికి పిలిచి మర్డర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.