భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి బొగ్గు గనులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పాల్వంచలోని సీతారాంపట్నం సబ్‌స్టేషన్‌లో విద్యుత్ కేబుల్ తెగిపోవడం వల్ల తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి సరఫరా నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఫలితంగా కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో, సింగరేణి గనుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇవీ చూడండి: రాష్ట్రంలో 644కు చేరిన కరోనా కేసులు