"ఇవాళ మా 30వ వివాహ వార్షికోత్సవం... అయినప్పటకీ మా ఆవిడను వదిలి డిపో చుట్టూ తిరుగుతున్నా.. ఆర్టీసీని నేను రెండో పెళ్లి చేసుకున్నా. ఆర్టీసీ అంటే నాకు అంత ఇష్టం" ఇల్లెందులో శాటిలైట్ బస్డిపోకు శంకుస్థాపన సందర్భంగా మంత్రి పువ్వాడ ఈ విధంగా చమత్కరించారు. ఇల్లెందులో శాటిలైట్ బస్డిపోను దసరానాటికి ప్రారంభిస్తామన్నారు.
రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలవుతుంటే కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి పువ్వాడ ఆరోపించారు. సీతారామ జలాల ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కానుందని తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి జిల్లాల వారిగా పర్యటన చేస్తారని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతపై ఎటువంటి భయం ఆందోళన అవసరం లేదని తెలిపారు.
ఇదీ చూడండి: భారత ఫుట్బాల్ మహిళా జట్టులో తెలుగమ్మాయికి స్థానం