భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 65వ రాష్ట్రస్థాయి అండర్-17 బాలుర వాలీబాల్ క్రీడా పోటీలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలను తెలంగాణ రాష్ట్ర విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు జాతీయ జెండాను ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు. ఈ క్రీడలు 4వ తేదీ వరకు జరుగనున్నాయి.
క్రీడల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల బాలురు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేసీ వెంకటేశ్వరరావు, డీఈవో సరోజిని దేవి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : స్వామివారి ఉత్సవాల్లో శునకాల పోటీలు