భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి సంధ్య హారతి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో లక్ష్మణ సమేత ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు జరిపారు. ప్రధాన దేవాస్థానంలోని సీతారాములు బంగారు కవచాలతో స్వర్ణ అలంకృతులుగా దర్శనమిచ్చారు.
ఉపాలయంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములను మేళతాళాల మధ్య అద్దాల మండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ గజ, అశ్వ, శేష, గరుడ అష్టోత్తరశత హారతులు అందించారు.
ఒక్కో హారతి అందిస్తూ దాన్ని దర్శించుకోవడం వల్ల కలిగే శుభ ఫలితాలను భక్తులకు తెలిపారు. పండితుల వేదమంత్రాలతో సంధ్య హారతి అందిస్తూ ధూపదీప నైవేధ్యాలు సమర్పించారు.
ఇదీ చూడండి: యాదాద్రి ఆలయంలో ఘనంగా ఊంజల్ సేవా ఉత్సవం