ETV Bharat / state

కరోనా టీకా పంపిణీకి యంత్రాంగం సన్నద్ధం: కలెక్టర్ - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

కరోనా టీకా పంపిణీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార యంత్రాంగం సర్వ సన్నద్ధమవుతోంది. తొలి విడత టీకా ఇచ్చేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. మొదటి విడతలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి టీకా పంపిణీ చేయాలని వైద్యశాఖ నిర్ణయించిందని చెప్తోన్న కలెక్టర్ ఎంవీ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

special-interview-with-bhadradri-kothagudem-collector-mv-reddy-on-corona-vaccine-distribution
కరోనా టీకా పంపిణీకి యంత్రాంగం సన్నద్ధం: కలెక్టర్ ఎంవీ రెడ్డి
author img

By

Published : Dec 20, 2020, 4:42 PM IST

కరోనా టీకా పంపిణీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. తొలి దఫాలో 10,942 మంది వైద్య సిబ్బందిని గుర్తించారు. టీకా పంపిణీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. వ్యాక్సిన్ జిల్లాకు వచ్చిన తర్వాత భద్రపరిచేందుకు కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

  • ఈటీవీ భారత్: కరోనా టీకా పంపిణీకి జిల్లాలో వైద్యశాఖ ఎలా సన్నద్ధమవుతోంది. తొలిదఫా ప్రాధాన్యం ఎవరికి ఇస్తున్నారు?

కలెక్టర్: కొవిడ్ టీకా పంపిణీకి జిల్లా యంత్రాంగం, సిబ్బందిని పూర్తిస్థాయిలో సమాయత్తం చేస్తున్నాం. జిల్లాకు టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంపిక చేసిన వారికి టీకా పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలతో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉన్న వైద్యశాఖ సిబ్బందికి తొలి దఫాలో కరోనా టీకా ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. ఇందుకోసం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బందిని గుర్తించే ప్రక్రియ చేపట్టాం. తొలిదఫాలో టీకా ఇచ్చేందుకు ఇప్పటి వరకు 10, 942 మందిని గుర్తించాం.

  • ఈటీవీ భారత్: టీకా పంపిణీ సజావుగా సాగాలంటే శాఖల మధ్య సమన్వయం అవసరం కదా..? ఎన్ని శాఖలు భాగస్వామ్యం చేస్తున్నారు?

కలెక్టర్: టీకా పంపిణీలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా ఉండేలా అన్ని శాఖల యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేస్తున్నాం. జిల్లా స్థాయిలో కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులంతా ఉంటారు. మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశాం. తహసీల్దార్ కన్వీనర్‌గా ఉంటారు. ఈ కమిటీలో మండల అధికారులు ఉంటారు. ఎంపీడీవోలు, మెడికల్ ఆఫీసర్లు, సీడీపీవోలు, తహసీల్దార్లు, ఎస్సైలు మండల స్థాయి కమిటీల్లో ఉంటారు. టీకా పంపిణీలో అన్ని శాఖల సమన్వయంతో సజావుగా జరిగేలా చూస్తున్నాం.

  • ఈటీవీ భారత్: టీకాలు వేసే సిబ్బందికి ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు?

కలెక్టర్: టీకా ఇచ్చేందుకు మండలాల వారీగా ప్రత్యేక బృందాలను నియమిస్తున్నాం. జిల్లా స్థాయి నుంచి పీహెచ్‌సీ వరకు అన్ని స్థాయిల్లో అధికారులు, సిబ్బందికి టీకా ఇచ్చేందుకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. ఒక్కో బృందంలో ఐదుగురు సిబ్బంది ఉంటారు. వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. టీకా వచ్చిన తర్వాత మరోసారి ప్రత్యేకంగా అవగాహన కల్పించేలా జిల్లా అధికారులు బాధ్యత తీసుకుంటారు.

  • ఈటీవీ భారత్: 16 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్ వేస్తారా? పాలిచ్చే తల్లులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఇస్తున్నారా..?

కలెక్టర్: తొలిదఫాలో ఎంపిక చేసిన వారికి మాత్రమే టీకా అందిస్తాం. ప్రభుత్వ ప్రాధాన్యతను బట్టి ఫ్రంట్ లైన్ వర్కర్స్, పెద్ద వయసు వారికే ప్రాధాన్యతలను బట్టి టీకా అందిస్తాం. జబ్బులు ఉన్నవారు, జలుబు, జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఇవ్వడం లేదు. తదుపరి దఫాలో వారికి ఇచ్చేలా ప్రణాళిక ఉంది.

  • ఈటీవీ భారత్: టీకా భద్రపరిచేందుకు ఎలాంటి సౌకర్యాలు, ఏర్పాట్లు చేస్తున్నారు?

కలెక్టర్: వాక్సిన్ వచ్చిన తర్వాత భద్రపరిచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. నిల్వ చేసేందుకు కావాల్సిన అన్ని సదుపాయాల్ని సిద్ధం చేస్తున్నాం. అదనంగా కావాల్సిన సౌకర్యాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. టీకా వచ్చేనాటికి కావల్సిన అన్ని సదుపాయాలు సమకూర్చుకుంటాం.

  • ఈటీవీ భారత్: కరోనా టీకాతో ఒకవేళ దుష్ప్రభావాలు ఎదురైతే..ఎలా ఎదుర్కొంటారు?

కలెక్టర్: టీకాతో ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తినా ఎదుర్కొనేందుకు వైద్యశాఖ సన్నద్ధంగా ఉంది. ఇందుకోసం అవసరమయ్యే కిట్స్‌ను వెంటనే అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని కేంద్రాల్లో ఈ కిట్స్ అందుబాటులో ఉంచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

  • ఈటీవీ భారత్: టీకాలు ఎలా ఇవ్వబోతున్నారు. ప్రత్యేక కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా..?

కలెక్టర్: జిల్లాలోని పీహెచ్‌సీల వారీగా కేంద్రాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించాం. పీహెచ్‌సీల వారీగా ఎంతమంది ఉన్నారు అనేది గుర్తిస్తున్నాం. అందుకు అనుగుణంగా టీకా పంపిణీ చేసేలా సిద్ధమవుతున్నాం. స్థానిక ఆస్పత్రుల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా సజావుగా టీకా పంపిణీ చేయడమే మా లక్ష్యం.

ఇదీ చదవండి: పులిగుండాల ప్రాజెక్టులో ముగ్గురు యువకుల గల్లంతు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.