ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా టెటం పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు(Maoists killed police constable) రెచ్చిపోయారు. కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఉమేశ్ మరకంను మావోయిస్టులు హత్యచేశారు(Maoists killed police constable). పదునైన ఆయుధంతో చంపారని పోలీసులు గుర్తించారు. కానిస్టేబుల్ హత్య మంగళవారం రాత్రి జరిగిందని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ ధ్రువీకరించారు. ఉదయం మృతదేహాన్ని జవాన్లు వెలికితీశారు. మావోయిస్టుల కదలికలు గుర్తించేందుకు సంబంధించిన క్యాంప్‌ను ప్రారంభించడంలో ఉమేశ్ మారకం కీలక పాత్ర పోషించారని ఎస్పీ వెల్లడించారు. గతంలోనే పలుమార్లు మావోయిస్టులు హెచ్చరించారని.. ఈ క్రమంలోనే దురాగతానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: midday meals in nalgonda: కూర లేదని చిన్నారులను కారంపొడితో తినమన్నారు..!