భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఘర్షణ జరిగింది. సీఆర్ఓ క్యాంపు కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిపై నిన్న రాత్రి భక్తులు దాడికి దిగారు. గత రాత్రి 11 గంటల సమయంలో కొందరు వ్యక్తులు ఆలయ ప్రాంగణంలో మద్యం సేవించేందుకు సన్నద్ధమవుతుండగా ఉద్యోగి వద్దని వారించాడు. వారి ప్రయత్నాన్ని విరమింపజేశాడు. మర్నాడు ఉద్యోగి ఒంటరిగా దొరకడంతో... దాడికి దిగారు. మొహంపై పిడిగుద్దులు గుప్పించారు. నిందితులు వరంగల్‌కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.