భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. జాతీయ కార్మిక సంఘాలు మూడు రోజుల పాటు సమ్మెను ప్రతిపాదించిన నేపథ్యంలో... రాష్ట్ర బొగ్గు గని కార్మిక సంఘాలు నిన్న సమ్మెకు మద్దతు తెలిపాయి. నేడు కార్మికుల సంఘం మద్దతుతో కొందరు విధులకు హాజరయ్యేందుకు వచ్చారు.
జాతీయ కార్మిక సంఘాల నాయకులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా... పోలీసులు వారిని నిలువరించారు. పోలీసుల బందోబస్తు నడుమ వివిధ గనుల్లో కార్మికులు అక్కడక్కడ హాజరయ్యారు. పోలీసులు అడ్డుకోవడం పట్ల జాతీయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: బీమా ఉన్నా సొమ్ము కడితేనే కరోనాకు చికిత్స