సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ పిలుపుమేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని సింగరేణి ఉపరితల గనుల్లో కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సింగరేణి కార్మికులు జేకే5, కోయగూడెం ఉపరితల బొగ్గు గనుల్లో విధులకు హాజరు కాకపోవడం వల్ల సుమారు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తుతో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
కాగా సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై కార్మికుల్లో ఉద్యోగ భద్రత ఆందోళన కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో సమ్మె పట్ల కార్మికులు సైతం సానుకూలంగా ఉన్నారు.
ఇద చదవండి: పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ