ETV Bharat / state

'కేసీఆర్‌ ఎనిమిదేళ్ల పాలనలో 8 వేల రైతు ఆత్మహత్యలు' - కేసీఆర్​పై షర్మిల కామెంట్లు

YS Sharmila Padayatra at Burgampahad: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఏ మాత్రం గౌరవించకుండా... కుటుంబ బాగు కోసమే కేసీఆర్‌ పాటుపడుతున్నారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల ఆరోపించారు. ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా 68వ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో షర్మిల పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా రైతుగోస దీక్షలో పాల్గొన్న ఆమె.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కేసీఆర్‌ ఎనిమిదేళ్ల పాలనలో 8వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

sharmila padayatra
షర్మిల పాదయాత్ర
author img

By

Published : Apr 27, 2022, 4:59 PM IST

YS Sharmila Padayatra at Burgampahad: వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన మహా ప్రస్థానం పాదయాత్ర 68వ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో కొనసాగింది. మోరంపల్లి బంజర గ్రామానికి వచ్చిన షర్మిలకు మహిళలు పూలమాలలు వేసి ఆహ్వానం పలికారు. అనంతరం రైతు గోస దీక్షలో షర్మిల పాల్గొన్నారు.

యాసంగిలో వరి వేయొద్దన్న ముఖ్యమంత్రి కేసీఆర్​ మాటలు నమ్మి.. 17 లక్షల ఎకరాల్లో రైతులు పంట వేయలేదని షర్మిల ఆరోపించారు. వారందరికీ ఎకరాకు రూ. 25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు. 8 వేల కొనుగోలు కేంద్రాలని చెప్పి.. 1000 మాత్రమే తెరిచారని.. దిక్కుతోచని రైతులు దళారులకు రూ. 1200కే అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర కల్పించని ముఖ్యమంత్రి, అధికారులెందుకని ప్రశ్నించారు.

వారిని గౌరవిస్తున్నారా.?: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, ఉద్యమంలో పాల్గొన్న వారిని కేసీఆర్​ గౌరవిస్తున్నారా అని షర్మిల మండిపడ్డారు. కుటుంబ బాగుకోసమే తెలంగాణ తెచ్చినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఉద్యమంలో వికలాంగులైన వారిని ఎంత మందిని ఆదుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్​ కుటుంబం, తెరాస నేతలే బాగుపడ్డారని ధ్వజమెత్తారు.

"ఇంటికో ఉద్యోగం అని చెప్తే నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. త్యాగాలు చేసింది వారు. ఆత్మబలిదానం చేసుకుంది వారు. ఆత్మ బలిదానం చేసుకున్న వారి త్యాగం వృథా అయింది. రైతు బంధు పేరుతో రైతులకు రూ. 5000 ఇచ్చి మరో చేతినుంచి రూ. 25 వేలు దోచుకుంటున్నారు. తెరాస అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు." -వైఎస్​ షర్మిల, వైతెపా అధ్యక్షురాలు

కేసీఆర్‌ పాలనలో 8వేల రైతు ఆత్మహత్యలు: షర్మిల

ఇవీ చదవండి: KTR in TRS Plenary: 'కేసీఆర్‌ హిస్టరీతో పాటు జాగ్రఫీని సృష్టించారు'

ముహుర్తం టైం దాటినా బరాత్​లో స్టెప్పులు.. వరుడ్ని చితకబాది, పెళ్లి క్యాన్సిల్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.