ETV Bharat / state

అధికారుల నిర్వాకంతో నేలపాలైన సీతారాముల తలంబ్రాలు - telangana varthalu

అక్షిత అంటే ఎప్పటికీ నాశనం కానిది...శాశ్వతమైనదని అర్థం. తలపై తలంబ్రాలను వేస్తే సర్వశుభాలు కలుగుతాయని... శుభకార్యాలకు ఉపయోగిస్తే అంతా మంచే జరుగుతుందని నమ్మకం. అలాంటి తలంబ్రాల పాత్ర రాములవారి కల్యాణ ఘట్టంలో ఎంతో విశిష్టమైనది. జానకి దోసిట కెంపులుగా...రాముడి దోసిట నీలపు రాసులుగా కనిపించే తలంబ్రాలు అందుకున్న భక్తుల ఆనందానికి అవధులుండవు. అంతటి ప్రాముఖ్యమున్న తలంబ్రాలు.. అధికారుల నిర్వాకంతో నేలపాలయ్యాయి. భక్తుల మనోభావాలకు పాతరేసి గొయ్యి తీసి పాతిపెట్టడం తీవ్రవిమర్శలకు దారితీస్తోంది.

సీతారామచంద్రస్వామి తలంబ్రాలను నేలపాలు చేశారు..
సీతారామచంద్రస్వామి తలంబ్రాలను నేలపాలు చేశారు..సీతారామచంద్రస్వామి తలంబ్రాలను నేలపాలు చేశారు..
author img

By

Published : Mar 5, 2021, 3:38 PM IST

Updated : Mar 5, 2021, 7:23 PM IST

భద్రాచలం శ్రీరాముడి దివ్యక్షేత్రంలో ఏటా వైభవోపేతంగా సాగే శ్రీరామనవమి వేడుకల్లో ఒక్కో ఘట్టానికి ‌ఒక్కో విశిష్టత ఉంటుంది. సీతారాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాలకు అత్యంత ప్రాముఖ్యం ఉంది. ఏటా అత్యంత వైభవంగా సాగే ఈ వేడుకల కోసం తెలుగు ప్రాంతాల నుంచే కాకుండా... వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తారు. నిత్య కల్యాణంలో పసుపురంగు తలంబ్రాలను ఉపయోగించడం ఓ ఎత్తైతే...రాములవారి వార్షిక కల్యాణ వేడుకలో మాత్రం ఎరుపురంగు తలంబ్రాలను ఉపయోగించడం ఆనవాయితీ. ఆ తలంబ్రాలు తమ దోసిట పడటాన్ని భక్తులు మహద్భాగ్యంగా భావిస్తారు. అంతటి ప్రాశస్త్యం ఉన్న భద్రాద్రి రాములవారి తలంబ్రాలు... ఆలయ అధికారులు నిలువెత్తు నిర్లక్ష్యంతో నేలపాలయ్యాయి. ఆలయ ఈవో నుంచి మొదలుకొని ఏఈవో, ఇతర అధికారులు, సిబ్బంది అంతా దగ్గరుండి మరీ 20 అడుగుల లోతైన గోతిలో పాతిపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సీతారామచంద్రస్వామి తలంబ్రాలను నేలపాలు చేశారు..

గుట్టుచప్పుడు కాకుండా

అసలు విషయానికి వస్తే.. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాల కోసం ఆలయ అధికారులు.. భారీగా తలంబ్రాలు తయారు చేయించారు. కొవిడ్ ప్రభావంతో సీతారాముల కల్యాణానికి భక్తులకు అనుమతి ఇవ్వలేదు. కేవలం ప్రముఖులు, వైదిక పెద్దల సమక్షంలోనే కల్యాణఘట్టం నిర్వహించారు. దీంతో భారీగా తలంబ్రాలు మిగిలిపోయాయి. కరోనా నిబంధనలు సడలించాక తలంబ్రాలను భక్తులకు పంచిపెట్టాల్సి ఉన్నా...ఆలయ అధికారులు పట్టించుకోలేదు. దాదాపు ఏడాది పాటు ఓ గదిలో నిల్వచేసే సరికి తలంబ్రాల నాణ్యత దెబ్బతింది. వాసన రావడం, పురుగులు పట్టి పాడయ్యాయి. దీనిని గమనించిన ఆలయ అధికారులు.. గుట్టుచప్పుడు కాకుండా వాటిని అక్కడి నుంచి తరలించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తమపట్నంలోని గోశాలలో 20 అడుగుల గోతి తవ్వి అందులో తలంబ్రాలను పారబోశారు. నిత్యం చెత్త తరలించే వాహనాల్లో పవిత్రమైన తలంబ్రాలను తీసుకెళ్లి.. జేసీబీలతో గొయ్యి తీసి అందులో పడేశారు. అధికారులు, సిబ్బంది, వైదిక పెద్దలు అంతా ఈ తతంగానికి ప్రత్యక్షసాక్ష్యంగా నిలిచారు.

సర్వత్రా విమర్శలు

పవిత్రమైన తలంబ్రాలను మట్టిలో పూడ్చేయడం, చెత్తసేకరించే వాహనాల్లో తరలించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల మనోభావాలకు ఆలయ అధికారులు పాతరేశారని ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అధికారులు మాత్రం తలంబ్రాలు పాడైపోయినందునే ఈ చర్యకు పూనుకున్నట్లు సమర్థించుకుంటున్నారు.

ఇదీ చదవండి: ఎన్నికల కోసం కాకుండా.. ప్రజల కోసం పనిచేయండి : కేటీఆర్

Last Updated : Mar 5, 2021, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.