ఈనెలలో పదవీ విరమణ చేయనున్న ఇంల్లెందు సింగరేణి సంస్థ ఏరియా జీఎం పీవీ సత్యనారాయణను కార్యాలయ అధికారులు సన్మానించారు. 1985లో విధుల్లో చేరిన ఆయన 35 ఏళ్ల 6నెలల పాటు పలు విభాగాల్లో పనిచేశారు. 2019 డిసెంబరు నుంచి ఇల్లెందు ఏరియాకు జీఎంగా విధులు నిర్వహిస్తున్నారు.
ఇల్లెందు ఏరియాలో సింగరేణి ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ ద్వారా 39 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని నిర్ణీత సమయానికి ప్రారంభమయ్యేలా కృషి చేశారని... బొగ్గు ఉత్పత్తి, రవాణాలో ఇల్లెందు ఏరియాను ముందుంచడంలో కృషి చేశారని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎజీఎం గిరిధరరావు, ఆఫీసర్ నూతల సుజ్ఞాన్, కేవీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఉదాసీనత అసలే వద్దు.. వారంలోనే పరిస్థితి తీవ్రం కావచ్చు!