భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం జరగాల్సిన సంధ్య హారతి కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. అర్చకులు విధులు నిర్వహించడానికి ఆటకం ఏర్పడంటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు.
కొన్ని రోజుల క్రితం ఆలయ అర్చకుల బంధువు ఒకరు చనిపోయారు. అందువల్ల సుమారు 15 మంది అర్చకులు ఆలయం లోపనికి ప్రవేశించడానికి ఆటంకం ఏర్పడింది. మిగతా అర్చకులు ప్రధాన ఆలయంతోపాటుగా ఉప ఆలయాల్లో విధులు నిర్వహించాల్సివస్తోంది. ఈ కారణంగా ప్రతి శుక్రవారం సాయంత్రం స్వామి వారికి జరిగే సంధ్య హారతి కార్యక్రమాన్ని అధికారులు నిలిపివేశారు. అర్చకుల కొరతను సాకుగా చూపి కార్యక్రమాన్ని రద్దుచేయడం సరికాదని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: సంక్షేమ పథకాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్: ఇంద్రకరణ్