భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్ణశాలకు నిత్యం వచ్చే పర్యటకులతో రద్దీగా ఉండే భద్రాచలం-దుమ్ముగూడెం రహదారి మరమ్మతులు నిలిచిపోయాయి. గత రెండు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. సుమారు 4 కిలోమీటర్ల వరకు రోడ్డు తవ్వటం వల్ల గుంతలు ఏర్పడి వాహనాలు కుదుపునకు గురవుతున్నాయి.
ఫలితంగా ప్రయాణికులు ఇక్కట్ల పాలవుతున్నారు. దుమ్ము, ధూళి వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక... ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సత్వరమే స్పందించి రహదారి పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి : మీరు చేసే సాయం... నా పెనిమిటికి ప్రాణం పోస్తుంది'