ETV Bharat / state

'మీరు చేసే సాయం... నా పెనిమిటికి ప్రాణం పోస్తుంది' - సాయం కోసం ఎదురు చూస్తున్న కుటుంబం

రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. రూపాయి రూపాయి లెక్కెట్టుకుని బతికే వారికి కొండంత కష్టం వచ్చింది. కుటుంబ పెద్దకు రెండు కిడ్నీలు పాడైపోయాయి. ఉన్నతందా ఊడ్చిపెట్టి నాలుగేళ్లుగా వైద్యం చేయించారు. ఇప్పుడు కనీస వైద్యం చేయించలేక... భర్త అవస్థను చూడలేక సాయంకోసం దీనంగా ఎదురుచూస్తోంది జగిత్యాలకు చెందిన ఓ పేద కుటుంబం.

a famaly request for Financial Help to Treatment of Kidney Failure
సాయం కోసం ఎదురు చూస్తున్న కుటుంబం
author img

By

Published : Dec 22, 2019, 10:57 AM IST

Updated : Dec 22, 2019, 4:41 PM IST

'మీరు చేసే సాయం... నా పెనిమిటికి ప్రాణం పోస్తుంది'

కూలికి వెళ్తేగాని పూట గడవని ఆ కుటంబానికి పెద్ద కష్టం వచ్చింది. కుటుంబ పెద్దకు రెండు కిడ్నీలు పాడై మంచం పట్టాడు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తన భర్తను రక్షించుకోవాలన్న తపనతో వైద్యానికి లక్షలు వెచ్చించారు. అయినా పూర్తిగా కోలుకోలేదు. కనీస వైద్యం చేయించడానికి చేతిలో చిల్లగవ్వలేక... ఉదార మనసు కలిగిన దాతల కోసం ఆమె ఎదురుచూస్తోంది.

జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన పెంట రాజయ్యది నిరుపేద కుటుంబం. నాలుగేళ్ల కిందట రాజయ్యకు రెండు కిడ్నీలు పాడైపోయాయి. అప్పటి నుంచి ప్రైవేటు వైద్యశాలలో డయాలసిస్ చేస్తూ ఉన్నదంతా ఊడ్చి ఖర్చుపెట్టారు. ఇప్పుడు కనీసం వైద్య ఖర్చుల కోసం చేతిలో చిల్లిగవ్వ లేక... రోజురోజుకూ దిగజారుతున్న భర్త ఆరోగ్యాన్ని చూడలేక ఆమె పడుతున్న మనోవేదన వర్ణణాతీతం.

రాజయ్య భార్య లక్ష్మి కూలి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. భర్తకు వైద్యం ఎలా చేయించాలో తెలియక కన్నీరు మున్నీరు అవుతోంది... మనసున్న మారాజులు ఎవరైనా సాయం అందిస్తే.. తన భర్త ప్రాణం నిలబెట్టినవారవుతారని అశృనయనాలతో అర్థిస్తోంది.

ఇదీ చూడండి: ప్రయాణికుల కోసం ప్రాణాలు వదిలిన డ్రైవర్

Intro:జి. గంగాధర్ జగిత్యాల జిల్లా,
8008573563

..............

TG_KRN_21_21_KIDNEY_FAIL_PKG_TS10035

రెండు కిడ్నీలు చెడిపోయి వైద్య ఖర్చులకు ఇబ్బంది....
సాయం కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబం...
ఈటీవీ కథనం....

యాంకర్
అసలే పేద కుటుంబం... కూలి పని చేస్తే గానీ పూటగడవని ఆ కుటుంబ పెద్దకు రెండు కిడ్నీలు చెడిపోయి కనీస వైద్య ఖర్చులు చేతిలో చిల్లిగవ్వ లేక ఎవరైనా సాయం అందిస్తారని ఎదురుచూస్తుంది జగిత్యాలకు చెందిన ఓ పేద కుటుంబం....

వాయిస్ ఓవర్
()
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన పెంట రాజయ్యది నిరుపేద కుటుంబం.... రెక్కాడితే గానీ డొక్కాడని వారికి... కుటుంబాన్ని పోషించే రాజయ్యకు రెండు కిడ్నీలు చెడిపోయాయి.... నాలుగేళ్లుగా ప్రైవేటు వైద్యశాలలో డయాలసిస్ చేస్తూ వెళ్లదీస్తున్నారు.. ఇప్పటివరకు ఐదు లక్షల వరకు ఖర్చు చేసిన వారు ఉన్నదంతా వైద్య ఖర్చులకే ఊడ్చిపెట్టారు.... ఇప్పుడు కనీసం వైద్య ఖర్చుల కోసం చేతిలో చిల్లిగవ్వ లేక ఆపన్నుల సాయం కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తుంది... భార్య లక్ష్మి కూలి పని చేస్తే కుటుంబ పోషణ సాగుతుండగా.... భర్తకు వైద్యం ఎలా చేయించాలో తెలియక కన్నీరు మున్నీరు అవుతోంది...మనసున్న మారాజులు ఎవరైనా సాయం అందిస్తే తన భర్తకు వైద్యం అందిస్తామని భార్య లక్ష్మి కన్నీళ్లతో వేడుకుంటుంది....

బైట్. లక్ష్మి, రోగి భార్య
బైట్. రాజయ్య, రోగి

Body:.

Conclusion:.
Last Updated : Dec 22, 2019, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.