భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 31వ రహదారి భద్రతా వారోత్సవాలను జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్(ఎంవీఐ) శ్రీనివాస్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజేందర్, సీఐ వేలు చందర్, లారీ యజమానుల సంఘం నాయకులు, డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
ప్రతి ఒక్క డ్రైవరు, ఓనరు వాహనంపై పూర్తి అవగాహన కలిగి రహదారి నియమాలను పాటించాలని ఎంవీఐ శ్రీనివాస్ లారీ డ్రైవర్లను కోరారు. వ్యక్తిగత క్రమశిక్షణ కలిగి ఉండాలని దీని వల్ల ప్రమాదాల నివారించవచ్చని సీఐ తెలపారు. శిరస్త్రాణం ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని వాహనదారులను కోరారు. రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరు కానున్నట్లు రవాణాశాఖ అధికారులు తెలిపారు.