భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో మార్చి 25 నుంచి ఏప్రిల్ 8 వరకు తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఆ ఉత్సవాల్లో ఏప్రిల్ 2న జరిగే శ్రీరామనవమి, ఏప్రిల్ 3న జరిగే మహా పట్టాభిషేకం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సీతారాముల కల్యాణం చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున రానున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచే ప్రణాళికను సిద్ధం చేసుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇబ్బందులు కలిగితే ఊరుకునేది లేదని అధికారులను హెచ్చరించారు.
ఇదీ చూడండి : 'ఇలా చేస్తేనైనా సమస్య పరిష్కరిస్తారేమో అని...'