ETV Bharat / state

భారీ వర్షాలతో నిలిచిన సింగరేణి బొగ్గు ఉత్పత్తి - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

రాష్ట్రంలోనే ప్రధాన బొగ్గు ఉత్పత్తి సంస్థ సింగరేణి వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రెండ్రోజులుగా ఏకధాటిగా కురుస్తోన్న వర్షాల ధాటికి బొగ్గు వెలికితీతకు అంతరాయం కలిగినట్లు అధికారులు వెల్లడించారు.

రేన్ ఎఫెక్ట్ : సింగరేణి బొగ్గు గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

author img

By

Published : Aug 13, 2020, 12:31 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జెకె 5 ఉపరితలం, టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రెండు గనుల్లోనూ రోజుకు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కాగా వర్షం కారణంగా పూర్తిగా నిలిచిపోయిందని అధికారులు పేర్కొన్నారు.

ఓవర్ బర్డన్ పనులు సైతం...

మరోవైపు ఓవర్ బర్డెన్ పనులు కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయాయని తెలిపారు. పలు గ్రామాల్లో వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. వర్షం ధాటికి ఇల్లందు పట్టణంలోని ఓ ఇంటి ప్రహరి, గోడ సహా ఆశ కార్యకర్తకు చెందిన రెండు గదుల రేకుల ఇల్లు కూలిపోయింది.

కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా...

జిల్లా వ్యాప్తంగా కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లోనూ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం ఏరియాలో 9 వేల టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలగగా... మణుగూరు ఏరియాలో సుమారు 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.

శ్రీరాంపూర్​లోనూ...

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ సింగరేణి ఉపరితల గనిలోకి వర్షపు నీరు చేరింది. 80 వేల క్యూబిక్‌ మీటర్ల ఓబీ మట్టిని తరలించారు. వర్షాల కారణంగా 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.

బెల్లంపల్లిలోనూ...

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఖైరిగూడలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నందున బీపీఏ ఓసీపీ (2) ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రోజుకు 5 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : కరోనా పరీక్షలు, చికిత్సలపై హైకోర్టులో విచారణ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.