లాక్డౌన్ వల్ల నిషేధించిన మద్యం అమ్మకాలు ప్రభుత్వ అనుమతితో తిరిగి ప్రారంభమయ్యాయి. మద్యం అమ్మకాలు సడలించడం వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు వైన్ షాపుల ముందు మందుబాబులు బారులు తీరారు. పరిస్థితిని ముందే అంచనా వేసిన పట్టణ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు మద్యం దుకాణాల ముందు రసాయనాలు పిచికారీ చేయించారు. మాస్కు ఉంటేనే మద్యం అమ్మాలని నిబంధన విధించారు. అశ్వాపురంలో క్యూలైన్ పాటించలేని వాళ్లు పాదరక్షలను క్యూలో ఉంచి తమ వంతు వచ్చే వరకు వేచి ఉన్నారు. మద్యం కొనుగోలు చేసేందుకు మహిళలు సైతం క్యూలో నిలబడ్డారు.
మద్యం షాపుల ముందు.. మందుబాబుల క్యూ - మద్యం షాపుల ముందు.. మందుబాబుల క్యూ
కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్లో భాగంగా ప్రభుత్వం మద్యం అమ్మకాలపై తాత్కాలికంగా నిషేధం విధించింది. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో తిరిగి ప్రారంభించడం వల్ల మద్యం దుకాణాల ముందు మందుకోసం జనాలు బారులు తీరారు.