ETV Bharat / state

దేవుడి ప్రచార రథంలో గంజాయి సరఫరా - రూ.1.21 కోట్లు విలువ చేసే సరకు సీజ్ - భద్రాచలంలో గంజాయి ముఠా

Police Seized Ganja in Badrachalam : దేవుడి ప్రచారం ముసుగులో ముగ్గురు వ్యక్తులు గంజాయి రవాణా చేస్తూ భద్రాచలం పోలీసులకు అడ్డంగా దొరికారు. ఆ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు 484 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.1.21 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

Police Seized Ganja in badrachalam
Police Busted Ganja Smuggling Gang at Bhadrachalam
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 12, 2023, 10:48 AM IST

Police Seized Ganja In Badrachalam : సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు అక్రమార్కులు గంజాయి రవాణాను వ్యాపారంగా అలవాటు చేసుకుంటున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా గంజాయి రవాణాకు వివిధ మార్గాలను వెతుకుతున్నారు. నిన్నటి వరకు పుష్ప సినిమాని అనుసరించిన గంజాయి అక్రమార్కులు రోజురోజుకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.

తాజాగా భద్రాచలంలో దేవుడి ప్రచార రథంలో గంజాయిని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. అయితే పోలీసులకు అనుమానం రాకుండా ఉండటానికి ఒక ట్రాలీ ఆటోను దేవుడి ప్రచార రథంలా తయారు చేసి అందులో ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేశారు. కాషాయ వ్రస్తాలు ధరించి, వాహనంలో దేవతామూర్తుల విగ్రహాలతో ఒకరు స్వామీజీ గా మిగతా వారు భక్తులుగా వేషధారణ చేసి తిరుగుతూ భిక్షాటన ద్వారా జీవనం సాగిస్తున్నట్లు నమ్మిస్తూ గంజాయి రవాణా చేస్తున్నారు.

సంగారెడ్డిలో రూ.3 కోట్ల విలువ గల గంజాయి పట్టివేత

Police Busted Ganja Smuggling Gang at Bhadrachalam : ఇలా అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులుభద్రాచలం పోలీసులకు అడ్డంగా దొరికారు. ఏఎస్పీ పరితోష్‌ పంకజ్‌ ఆదేశాలతో భద్రాచలం ఎస్సై విజయలక్ష్మి సిబ్బందితో బ్రిడ్జి సెంటర్‌లో వాహనాలను తనిఖీ చేస్తుండగా దేవుని ప్రచారం చేస్తున్నట్లుగా వచ్చిన ఓ ఆటోను తనిఖీ చేశారు. అందులో ప్యాకెట్లలో ఉన్న 484 కిలోల గంజాయిని గుర్తించారు. వీటిని తెస్తున్న హరియాణాకు చెందిన మున్షిరాం, భగత, గోవింద్​ను అరెస్టు చేశారు.

భద్రాద్రి కొత్తగూడెంలో భారీ మొత్తంలో పట్టుబడ్డ గంజాయి - ఇద్దరి అరెస్ట్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : "తమ ప్రాంతానికి చెందిన బల్వన్‌ అనే వ్యక్తి ప్రోత్సాహంతో ఒక ఆటోను కొని దానిని దేవుడి ప్రచార రథంలా తయారు చేశారు ఈ ముగ్గురు నిందితులు. వీరే స్వామీజీగా, భక్తులుగా మారి ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా సరిహద్దుల్లోని కలిమెల పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. అక్కడ బుజ్జి అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేశారు. దాన్ని తమ ప్రాంతానికి తరలిస్తున్న క్రమంలో భద్రాచలం చెక్​పోస్ట్ వద్ద తనిఖీల్లో పట్టుబడ్డారు. ఆటోతో పాటు, గంజాయిని రెండు చరవాణిలను స్వాధీనం చేసుకున్నాం. వీటి విలువ రూ.1.21 కోట్లుగా నమోదు చేశాం. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించాం" అని సీఐ నాగరాజురెడ్డి తెలిపారు.

Ganjayi Smuggling in Bhadrachalam : మరోవైపు ద్విచక్ర వాహనంపై అక్రమంగా తరలిస్తున్న 3.5 కిలోల ఎండు గంజాయిని ఆబ్కారీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది భద్రాచలంలో బ్రిడ్జి వద్ద పట్టుకున్నారు. సీఐ ఆధ్వర్యంలో తనిఖీలు చేసిన పోలీసులు బైక్​పై గంజాయిని తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు.హైదరాబాద్‌కు చెందిన గొల్లపల్లి శివ, నవీన్‌ ఏపీలోని సీలేరు నుంచి గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశారు.

రూ.1.2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం - ఎక్కడంటే?

బోల్తా కొట్టిన కారు - బయటపడిన 2 క్వింటాళ్ల గంజాయి, ఎక్కడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.