భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో అనుమతిలేకుండా పురుగు మందులను తయారు చేస్తూ విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టైంది. పట్టణంలోని సునితా ట్రేడర్స్ వెనుక భాగంలో మూడు నెలల క్రితం ఆకుల నాగేశ్వరరావు ఓ దుకాణం తీసుకుని ఎటువంటి ఇతర అనుమతులు లేకుండా భారీ ఎత్తున పురుగు మందులు తయారు చేస్తున్నారని స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులతో కలిసి తాము దాడులు నిర్వహించినట్లు వ్యవసాయ అదనపు సంచాలకులు వాసవి రాణి తెలిపారు.
కాగా ఇది పూర్తిగా సేంద్రియ ఎరువుల గోమూత్రం అని చెబుతున్నప్పటికీ ఈ ప్రాంతంలో అనుమతి లేకుండా ప్యాకింగ్ చేయడం పురుగుమందులను నిల్వ చేయడం తీవ్ర నేరంగా పరిగణిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. పట్టణంలోని పలు పురుగు మందుల, విత్తన దుకాణాల్లో సోదాలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు.
ఇవీ చూడండి: వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం