భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు సర్వాంగ అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు.
ఈ సాయంత్రం పంచాంగ శ్రవణ పారాయణం ఉంటుందని వేద పండితులు తెలిపారు. సీతారాముల ఆదాయ వ్యయాలు వెల్లడించనున్నారు.
ఇవీచూడండి: ప్లవ నామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకున్నారా?